Hari Hara Veera Mallu: ఆ ఒక్క సీన్ పవన్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుందట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు. ఈ సినిమా కోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Hari Hara Veera Mallu: ఆ ఒక్క సీన్ పవన్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుందట..
Harihara Veeramallu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 07, 2022 | 8:49 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు. ఈ సినిమా కోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు పవన్. అలాగే రీసెంట్ గా భీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)అనే  హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. మొగలాయిలా కాలం నాటి కథతో పవన్ సినిమా చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరిహరవీరమల్లు సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ గా ఉండనుందట. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటిస్తున్నారు. అయితే ఆయనను భందించిన సమయంలో పవన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పదుల సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చే సీన్ ఉంటుందట.. ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అన్నది తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. సినిమాలో ఈ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో