Varsha Bollamma: ‘ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే పిచ్చి.. ఆ ఒక్క సినిమానే 50 సార్లు చూశాను’: వర్ష బొల్లమ్మ
సహాయక నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష బొల్లమ్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. లేటెస్ట్ గా నితిన్ నటించిన తమ్ముడు సినిమాలోనూ సెకెండ్ హీరోయిన్ గా మెరిసిందీ అందాల తార. శుక్రవారం (జులై 04) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ , ఊరి పేరు భైరవకోన, స్టాండప్ రాహుల్ , స్వాతిముత్యం తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది వర్ష బొల్లమ్మ. ఇప్పుడు తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ను పలకరించింది. నితిన్ నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ మెయిన్ హీరోయిన్ గా నటించింది. మరో ఫీమెల్ లీడ్ పాత్రలో వర్ష బొల్లమ్మ నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమ్ముడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే వర్ష పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తమ్ముడు సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వర్ష తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన ఇష్టాయిష్టాల గురించి కూడా చెప్పింది.
‘నేను రవితేజ హీరోగా విక్రమార్కుడు సినిమాన 50 సార్లు చూసా. మీరు వినేది నిజమే. నేను జోక్ చేయడం లేదు. ఎందుకంటే అప్పట్లో సమ్మర్ హాలిడేస్ 60 డేస్ వచ్చినప్పుడు 50 డేస్ మా కజిన్ వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ నా కజిన్ సిస్టర్ ప్రతిరోజు విక్రమార్కుడు సినిమా చూసేది. అప్పట్లో డీవీడీలు ఉండడంతో సినిమా క్యాసెట్ వేసుకొని దాదాపు నేను ఉన్నని రోజులు అంటే 50 రోజుల పాటు ఒకే సినిమాను చూసింది. అందులో ఉండే పాటలు అంటే మా కజిన్ సిస్టర్ కి చాలా ఇష్టం. దాంతో సినిమా మొత్తాన్ని ప్రతిరోజు వేసి చూసేది. ఒకవేళ సినిమా వేయకపోతే ఆరోజు తనకు చాలా కోపం వచ్చేది. దీంతో చేసేదేమీ లేక మేము కూడా ప్రతిరోజు విక్రమార్కుడు సినిమా చూశాం. అప్పట్లో నాకు తెలుగు ఎక్కువగా రాదు.అయినా కూడా ఆ సినిమాలోని డైలాగ్స్ అన్ని నాకు గుర్తున్నాయి. విక్రమార్కుడు సినిమా 2,3సార్లు చూశాక చాలా అద్భుతంగా అనిపించింది ‘ అంటూ అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది వర్ష.
వర్ష బొల్లమ్మ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..