Telugu Cinema: చదువుకోవడానికి డబ్బులు లేవు.. ఇప్పుడు ఆమె బంగ్లా రూ.800 కోట్లు.. ఈ హీరోయిన్ ఎవరంటే..
సినీరంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటన, ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవట. కానీ ఇప్పుడు ఆమె ఉంటున్న బంగ్లా ధర రూ.800 కోట్లు. ఇంతకీ ఆమె ఎవరంటే..

అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ అమ్మాయి.. ఇండస్ట్రీని శాసించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో కట్టిపడేసింది. స్టార్ హీరోలకు జోడిగా కనిపించిన ఆ అమ్మాయి.. ఒకప్పుడు ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిందట. కానీ ఇప్పుడు రూ.800 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. వారితో ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? పెళ్లి తర్వాత కూడా అగ్రకథానాయికగా కొనసాగింది. ఆమె మరెవరో కాదు.. కరీనా కపూర్. 2000లో రెఫ్యూజీ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అశోక, భజరంగీ భాయిజాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సూపర్ హిట్ మూవీస్ కాకుండా.. ఎన్నో స్పెషల్ సాంగ్స్ తో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరీనా కపూర్ 1980లో జన్మించారు. కరీనా సోదరి కరిష్మా కపూర్. 90వ దశకంలో టాప్ హీరోయిన్.
కరీనా కపూర్ తండ్రి రణధీర్ మాట్లాడుతూ.. “తన ఇద్దరు కుమార్తెలకు పాఠశాల నిర్మించడానికి ఇబ్బంది పడ్డాను” అని అన్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘మేము సంప్రదాయ చిత్రపరిశ్రమ కుటుంబానికి చెందినవాళ్లము. ఒకప్పుడు మేము పేదవాళ్లం. ఆ సమయంలో నా సోదరి కరిష్మా స్థానిక రైళ్లు.. బస్సులలో కాలేజీకి ప్రయాణించేవాళ్లము. ఆర్థిక ఇబ్బందలను చూశాం. ‘ అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కరీనా నివసిస్తున్న ఇంటి విలువ రూ.800 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెళ్లి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..