దయచేసి కాపాడండి.. నెటిజన్స్‌ను రిక్వెస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. కలర్ ఫోటో మూవీ తర్వాత చాందిని చౌదరికి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
దాంతో ఈ బ్యూటీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా లేదా చిన్న రోల్స్ లో కనిపిస్తుంది. అలాగే ఇటీవల బాలయ్య డాకు మహారాజ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. డాకు మహారాజ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది చాందిని చౌదరి. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే చాందిని ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్
తాజాగా చాందిని చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో 3 డేస్ బేబీకి Ab బ్లడ్ ఎమెర్జెన్సీఉంది తెలిపింది చాందిని. బేబీకి Ab బ్లడ్ ఎమెర్జెన్సీ అని తెలుపుతూ అందులో ఆ చిన్నారికి సంబందించిన హాస్పటల్ అడ్రస్, డీటైల్స్ అన్ని రాసుకొచ్చింది. రక్తం ఇచ్చి ఆ చిన్నారిని సేవ్ చేయండి. ముందుగానే సాయం చేసిన వారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చింది చాందిని. చిన్నారి కోసం చాందిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఆమె మంచి మనసును కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పలువురు చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








