AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Vyooham: డైరెక్టర్‌ ఆర్జీవీకి మరో ఎదురు దెబ్బ.. ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ రద్దు

డైరెక్టర్‌ రామ్ గోపాల్‌ వర్మ వ్యూహం సినిమా విడుదలకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

RGV Vyooham: డైరెక్టర్‌ ఆర్జీవీకి మరో ఎదురు దెబ్బ.. 'వ్యూహం' సినిమా సెన్సార్‌ రద్దు
RGV Vyooham movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 8:22 PM

డైరెక్టర్‌ రామ్ గోపాల్‌ వర్మ వ్యూహం సినిమా విడుదలకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ నాయకులను కించపరిచేలా వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారంటూ టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు కోర్టు మెట్లెక్కారు. దీంతో నవంబర్‌ 10నే థియేటర్లలోకి రావాల్సిన వ్యూహం విడుదల వాయిదా పడింది. అయితే ఎలాగోలా సెన్సార్‌ అనుమతులు తెచ్చుకున్న ఆర్జీవీ డిసెంబర్‌ 29న తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీడీపీ నాయకులు. శుక్రవారం ఈ పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా విడుదలకు బ్రేకులు వేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్న కోర్టు.. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలుపుదల చేస్తూ తీర్పుని ఇచ్చింది. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.

కాగా వర్మ వ్యూహం సినిమాపైనే దాఖలైన మరో పిటిషన్‌ను విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ ఈ సినిమా విడుదల చేయవద్దంటూ స్టే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆర్జీవీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. వ్యూహం సినిమాలో సీఎం జగన్‌ పాత్రను ప్రముఖ నటుడు, రంగం ఫేమ్‌ సమీర్‌ అజ్మల్ పోషించారు. అలాగే వైఎస్‌ భారతి రోల్‌లో నటి మానస నటించింది. రామ దూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ వ్యూహం సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ..

For those TDP guys and TDP channels asking why I filed the CONTRACT KILLING case in A P instead of telangana , Can I also ask why your baby Nara Lokesh filed a case to stop VYOOHAM in telangana instead of A P ??? pic.twitter.com/VstdA48zyD

— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..