Shiva Rajkumar: స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో శివరాజ్ కుమార్.. ఏ సినిమాలోనంటే
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు శివన్న. ఇక ఇప్పుడు తమిళనాడులో కూడా శివన్న సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు శివన్న మరో తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇటీవలే తమిళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తమిళ చిత్రం ‘జైలర్’లో ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు శివన్న. ఇక ఇప్పుడు తమిళనాడులో కూడా శివన్న సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు శివన్న మరో తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
రజనీకాంత్ తో ‘జైలర్’ సినిమాలో నటించిన శివరాజ్ కుమార్ ఆ తర్వాత రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో కలిసి ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో నటించాడు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘జైలర్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన శివన్న.. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు.
‘కెప్టెన్ మిల్లర్’తో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుండగా, ధనుష్-శివన్నల సినిమా విజయం సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, వెంకటేష్ సైందవ్ సినిమాకూడా సంక్రాంతికి విడుదలకానుంది. అలాగే నాగార్జున నా సామిరంగా సినిమాకూడా రిలీజ్ కానుంది. సాలిడ్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో శివన్న రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్లు చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. అరుణ్ మట్టేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కెప్టెన్ మిల్లర్ లో ప్రియాంక మోహన్, నివేదిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధనుష్‌తోపాటు శివరాజ్‌కుమార్, వినగన్, నాజర్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బీక్, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
