Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayakanth:కెప్టెన్‌తో స్నేహం చేస్తే ఎవరూ మర్చిపోలేరు.. విజయ కాంత్‌ అంత్యక్రియల్లో రజనీ కాంత్ కన్నీరు

ప్రధాని మోడీ, సీఎం జగన్‌, కేసీఆర్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, రవితేజ, నాని తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌ కాంత్‌కు నివాళి అర్పించారు. తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్‌ 29) అధికారిక లాంఛనాలతో విజయ కాంత్‌ అంత్యక్రియలను నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు

Vijayakanth:కెప్టెన్‌తో స్నేహం చేస్తే ఎవరూ మర్చిపోలేరు.. విజయ కాంత్‌ అంత్యక్రియల్లో రజనీ కాంత్ కన్నీరు
Vijayakanth, Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 5:58 PM

ప్రముఖ సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ కాంత్‌ మరణం అందరినీ కలచివేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం (డిసెంబర్‌ 28) ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రధాని మోడీ, సీఎం జగన్‌, కేసీఆర్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, రవితేజ, నాని తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌ కాంత్‌కు నివాళి అర్పించారు. తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్‌ 29) అధికారిక లాంఛనాలతో విజయ కాంత్‌ అంత్యక్రియలను నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కెప్టెన్ అంతిమ సంస్కారాల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ తన మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధను దిగమింగుకుని విజయ కాంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

‘విజయకాంత్ కన్న మూశారని తెలిసి నా హృదయం ముక్కలైంది. కెప్టెన్‌ మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు. ఆయనను డీఎండీకే మీటింగ్‌లో చివరిగా చూశాను. కోలుకున్నందుకు ఎంతో సంబరపడ్డాను. విజయకాంత్‌ స్నేహానికి ప్రతిరూపం. ఒక్కసారి అతనితో ఫ్రెండ్‌ షిప్‌ చేస్తే ఎవరూ మర్చిపోలేరు. మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. నేను ఒకసారి హాస్పిటల్‌లో ఉంటే నన్ను చూడడానికి వేలాది మంది అభిమానులు వచ్చారు. వాళ్లను కంట్రోల్‌ చేయలేక ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కానీ విజయ కాంత్ కేవలం 5 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆయన చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆఖరి రోజుల్లో విజయ్‌ కాంత్‌ను చూడడానికి నాకు వీలు కాలేదు. ఆయన లాంటి వాళ్లు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని ఎమోషనల్‌ అయ్యారు రజనీకాంత్‌

ఇవి కూడా చదవండి

విజయకాంత్ అంత్యక్రియల్లో రజనీ కాంత్

విజయ్ ఆంటోని నివాళులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.