Bigg Boss Sivaji: ‘నాకు కేఏ పాల్ మాత్ర‌మే తెలుసు’.. బిగ్ బాస్ శివాజీ ‘నైంటీస్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే

కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో శివాజీ ఇటీవలే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సందడి చేశారు. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. బిగ్‌ బాస్‌ టాప్‌-3లో నిలిచిన శివాజీ సినిమాలతో మళ్లీ బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా త్వరలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ వెబ్ సిరీస్‌ తో మన ముందుకు రానున్నాడు

Bigg Boss Sivaji: 'నాకు కేఏ పాల్ మాత్ర‌మే తెలుసు'.. బిగ్ బాస్ శివాజీ 'నైంటీస్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
Sivaji 90s Web Series
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 5:24 PM

కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో శివాజీ ఇటీవలే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సందడి చేశారు. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. బిగ్‌ బాస్‌ టాప్‌-3లో నిలిచిన శివాజీ సినిమాలతో మళ్లీ బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా త్వరలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ వెబ్ సిరీస్‌ తో మన ముందుకు రానున్నాడు. ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో తొలి ప్రేమ సినిమా ఫేమ్‌ వాసుకీ ఆనంద్‌ శివాజీ భార్యగా నటించింది. మౌళి, వసంతిక, రోహన్‌, స్నేహల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య హసన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో జనవరి 5వ తేదీ నుంచి శివాజీ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్‌ సంస్థ. అలాగే వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

శివాజీ ఇందులో లెక్కల మాస్టర్‌ చంద్రశేఖర్‌గా కనిపించనున్నారు. శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో నైంటీస్‌ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అమ్మాయిలు వచ్చి శివాజీని పలకరిస్తూ ‘నేను సుచిత డేవిడ్‌ పాల్‌’ అని అంటే, ‘నాకు కేఏ పాల్‌ మాత్రమే తెలుసు’ అంటూ శివాజీ చెప్పిన డైలాగు నవ్వులు తెప్పించింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా నైన్టీస్‌ ట్రైలర్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అమోఘా ఆర్ట్స్‌, ఎంఎన్‌వో ప్రొడక్షన్స్‌ బ్యానర్లపైనవీన్‌ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బలి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

నైన్టీస్ వెబ్ సిరీస్ ట్రైలర్..

జనవరి 5 నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.