Pushpa 2: పుష్ప 2 రిలీజ్‌కు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్.. టికెట్ ధరలపై ఏమన్నదంటే?

అల్లు అర్జున్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ కు మార్గం సుగమమైంది. అధిక మొత్తంలో పుష్ప 2 టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

Pushpa 2: పుష్ప 2 రిలీజ్‌కు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్.. టికెట్ ధరలపై ఏమన్నదంటే?
Allu Arjun Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2024 | 2:51 PM

అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని మంగళవారం (డిసెంబర్ 03) ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది.  బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని,  బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్‌ కోరారు.  దీనిని విచారించిన తెలగాణ హైకోర్టు చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ పుష్ప 2 సినిమా విడుదలకు  క్లియరెన్స్‌చ్చింది.   ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో  బెనిఫిట్‌ ద్వారా వచ్చే  కలెక్షన్ల  వివరాలను తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది.  బెనిఫిట్‌ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ ను ఆదేశించింది. అలాగే టికెట్‌ ధరల పెంపు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. .

కాగా డిసెంబర్ 05న పుష్ప 2 సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే  సినిమా బుకింగ్స్ కూడా  ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రిలీజ్ టైం  దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి ‘పుష్ప 2’ టీమ్‌ భారీ ప్రమోషన్‌ చేస్తోంది. ఈ సినిమా పాటలను కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. యూసఫ్ గూడ  లోని పోలీస్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల తో పాటు ఎస్ఎస్ రాజమౌళి  కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఏపీలోనూ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..

హైదరాబాద్ ఈవెంట్ లో పుష్ప 2 టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.