ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ

ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైర్లు పట్టుకుని ఊగిన మహిళ

Phani CH

|

Updated on: Dec 03, 2024 | 7:00 PM

ప్రస్తుతం కొందరు చేస్తున్న పనులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ చేస్తున్నారో లేదా ఇతరులను ఆకట్టుకునేందుకు పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. అలాంటి వాళ్లు మనదేశంలోనే కాదు అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ఉంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే షాక్‌తో కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అమెరికాలోని ఉటా రాష్ట్రం సాల్ట్‌ లేక్‌ సిటీలో ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హల్‌చల్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వైర్‌లపై పాకింది. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫోజులిచ్చింది. ఆమెను గమనించిన వారు వెంటనే ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేశారు. వారు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ అమ్మాయిని బలవంతంగా కిందకు దించారు. ఆమె చేసిన చర్య వల్ల దాదాపు 800 ఇళ్లకు చాలా సేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. స్థానికులు ఆ యువతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి

BSNL లో మరో అదిరిపోయే ప్లాన్‌.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్