Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్

Phani CH

|

Updated on: Dec 03, 2024 | 6:47 PM

మధ్యప్రదేశ్‌లో షాపింగ్ మాల్‌ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మాల్‌లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు రూ.18 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉద్యోగి పగలగొట్టాడు. నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్‌లోని ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు.

దాని తరువాత, అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పనికి రాకుండా చేశాడు. అయితే ఈ పనిని బయటి వ్యక్తి చేయలేదని, మాల్ స్వంత ఉద్యోగే చేశారని అనుమానించిన యాజమాని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుండి జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ అతని డిమాండ్ నెరవేరకపోవడంతో, అదే కోపంలో మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మాల్‌లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్‌లోని వస్తువులను పాడు చేశారనే ఆరోపణలతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ నిందితుడి మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: ప్రభాస్‌ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!

ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై

Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??