Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!
హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న త్రిష తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ తొలినాళ్లల్లో ఓ స్టార్ హీరో సినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నానంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. త్రిషకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది. తన కెరీర్ లోనే ఆ సినిమా తనకు చాలా స్పెషల్ అంటుంది త్రిష. అయితే తాజాగా ఓ టీవీ షోలో త్రిష మాట్లాడుతూ.. తన కెరీర్ లో అత్యంత ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా అదే అని చెప్పింది. త్రిష కెరీర్ ఆరంభంలో వర్షం సినిమా కోసం ఎంతో కష్టపడిందని అదే షోలో పాల్గొన్న త్రిష తల్లి తెలిపింది. ఈ సినిమా కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశారని.. దీంతో జలుబు, జ్వరంతో త్రిష బాగా ఇబ్బంది పడిందని.. ఒక దశలో సినిమా వదిలేసి వెళ్లిపోవాలనుకుందని చెప్పుకొచ్చింది. ఐతే చివరకు సినిమా ఫలితం చూశాక పడ్డ కష్టం అంతా మర్చిపోయిందని తెలిపింది. తన తల్లి చెప్పిన మాటలు వంద శాతం నిజమని త్రిష వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్
TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై
Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు
చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??
ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

