ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

Phani CH

|

Updated on: Nov 30, 2024 | 12:04 PM

ఎట్ ప్రజెంట్ బాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని.. సినీ విశ్లేషకులు అంటున్నారు. నెట్టింట కామెంట్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర బీటౌన్ పతనానికి కారణం ఎవరు.. ? అందుకు వన్‌ ఆఫ్ ది రీజన్ అక్షయ్ కుమారే అని అంటున్నారు కొంత మంది బాలీవుడ్ పీపుల్. మరి అందుకు అక్షయే వన్‌ ఆఫ్ ది రీజన్స్ ఎందుకో ఇప్పుడు చూద్దాం..!

ఇక ఈ ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో ఎక్కువగా కంటెంట్, విశ్లేషణ లోపించడమే కాదు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయని ఫిల్మ్ అనలిస్టులు అంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అని పిలవబడే స్టార్ హీరోస్ డిమాండ్ చేస్తున్న పారితోషికాలే ఇందుకు ప్రధాన కారణం అని వారు ఓ పాయింట్ రెయిజ్ చేశారు. అగ్ర నటీనటుల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయని.. ఫలితంగా నిర్మాతలపై మరింత భారం పడుతుంది. తారలు తీసుకునే పారితోషికం కారణంగా సినిమాకు సంబంధించిన కీలకమైన విభాగాల నుంచి డబ్బు కట్ చేయాల్సి వస్తుందని వారంటున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన పనుల నాణ్యత తగ్గుతుందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా అక్షయ్ కుమార్‌ సినిమాలను చూపిస్తున్నారు వాళ్లు. అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ బడేమియా చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటి నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీ కోసం హీరో అక్షయ్ కుమార్ దాదాపు 165 కోట్లు పారితోషికం తీసుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 111.49 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు తీవ్ర నష్టాలు వచ్చాయి. ఈ సినిమా స్క్రిప్ట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగానే విఫలమైంది. ఈ సినిమానే కాకుండా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే సినిమాలోను ఇదే తప్పు జరిగింది. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లతో నిర్మిస్తే హీరో అక్షయ్ రూ.65 కోట్లు తీసుకున్నాడు. కానీ ఈ మూవీ కేవలం రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో మరోసారి నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై

Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??

ఖాతాదారులకు అలర్ట్‌.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్‌ !!

ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం