Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు
పుష్ప-2 మేనియాతో దేశమంతా ఊగిపోతోంది. పుష్ప 1 హిట్టయ్యాక.. ఆ జోష్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కాస్తా పుష్ప-2 క్రేజ్ ను విపరీతంగా పెంచింది. దీనికితోడు బడ్జెట్ లో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. బన్నీ ఫ్యాన్స్ అయితే.. ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.. ఈ సీన్ టాలీవుడ్ లో మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ కనిపిస్తోంది.
అందుకే అన్ని చోట్లా పుష్పాను బంపర్ హిట్ చేయడానికి.. ఎక్కువమంది ఆడియన్స్ కు రీచ్ కావడానికి పుష్ప మేకర్స్ భారీ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. రాష్ట్రాలవారీగా వ్యూహాలను రూపొందించినట్లు తెలుస్తోంది. దానికి తొలి ప్రయత్నమే ఈవెంట్స్. నార్త్ లో, సౌత్ లో ఒక్కో చోట ఈవెంట్ ను కండక్ట్ చేస్తూ.. అన్ని ప్రాంతాలకూ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడేది తక్కువే అని చెప్పాలి. అలాంటిది.. పుష్పలాంటి సినిమా ప్రీ రిలీజ్ లోనే బిజినెస్ జరుగుతుందని… మొత్తం వచ్చేస్తుందని జ్ఞానవేల్ రాజా అన్నారు. ఈ ప్రొడ్యూసర్ ఈ స్థాయిలో పొగిడేసరికీ తమిళనాట దీని హైప్ బాగా పెరిగింది. నార్త్ లో చూసినా.. గట్టివారికే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చారు. దీంతో.. నార్త్ లో ఎక్కువ థియేటర్లలో ఈ బొమ్మ పడడానికి అవకాశం ఏర్పడింది. పైగా అక్కడ బన్నీ క్రేజ్ కూడా సినిమా రేంజ్ ను పెంచింది. ఇటు కర్ణాటకలో చూసినా.. స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ కే రైట్స్ ఇచ్చారు. అందుకే కన్నడ నాట ఇంతవరకు ఏ సినిమాకూ లేనంతగా దీనిని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ పేరున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉండడంతో.. థియేటర్లకు కొదవలేదు. పైగా ఈ సినిమా రిలీజ్ రోజున వేరే సినిమా రిలీజ్ లు లేకుండా చూసే అవకాశం వీరికి ఉంటుంది. పుష్ప రిలీజ్ అయ్యాక.. ఎక్కువ రోజులు థియేటర్లను హోల్డ్ చేసే కెపాసిటీ వారికి ఉంటుంది. దీంతో ఎక్కువమంది ప్రేక్షకులు దీనిని చూడడానికి వీలవుతుంది. అందుకే పుష్పా బిజినెస్ 1000 కోట్లకు మించి జరిగిందన్న టాక్ ఉంది. బన్నీ సినిమాలకు ఇంతకుముందు జరిగిన డిజిటల్ బిజినెస్ తో పోల్చితే.. పుష్పాకు మాత్రం ఓ రేంజ్ లో జరిగిందనే చెప్పాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??
ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్ !!
ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం
ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??
వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్ అని !!