Allu Arjun Income Tax: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇన్ కం ట్యాక్స్  ఎంత చెల్లించారో తెలుసా.?

Allu Arjun Income Tax: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇన్ కం ట్యాక్స్ ఎంత చెల్లించారో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Dec 03, 2024 | 1:01 PM

మన దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన సినీ సెలబ్రిటీల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు కూడా ఉన్నారు. దీంతో తెలుగు వారి కళ్లన్నీ వారిపై పడ్డాయి. చాలామంది చకచకా గూగుల్ చేస్తున్నారు. మీకు ఆ శ్రమ లేకుండా ఈ లిస్టులో ఉన్నవారిలో కొంతమంది డీటైల్స్ మీకు అందిస్తున్నాం. వారు ఎంత ట్యాక్స్ చెల్లించాలో కూడా చెబుతాం.

ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా.. సకాలంలో పన్నులు చెల్లించడంలో కూడా వీళ్లు ముందున్నారు. ఇలాంటి వాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన లిస్టును చూసినట్లయింతే.. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాను పరిశీలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ. 92 కోట్ల పన్నులు చెల్లించి.. షారుక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత స్థానం మాత్రం సౌతిండియా స్టార్ దే. ఈమధ్యే రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో.. తలపతి విజయ్ సుమారు రూ.80 కోట్లు పన్నులుగా చెల్లించారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో దాదాపు రూ.75 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. వీరితోపాటు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ లిస్టులో ఉన్నారు.

అత్యధిక పన్ను చెల్లించిన సినీతారలు లిస్టును ఓసారి చూద్దాం.
షారూఖ్ ఖాన్ – 92 కోట్లు చెల్లించి ఫస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే షారూక్ ఖాన్ సినిమాలతో పాటు మరికొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. దాంతోపాటు యాడ్స్ ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుంది. దీంతో భారీగా ఆదాయం సమకూరుతుంది. అందుకే ఈ స్థాయిలో ఆదాయపు పన్ను చెల్లించాడు. ఇక దళపతి విజయ్ సంగతి చూస్తే.. ఆయన 80 కోట్లు ఇన్ కం ట్యాక్స్ గా చెల్లించారు. ఈ విషయంలో ఆయన బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడినట్టే. మొత్తానికి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. సల్మాన్ ఖాన్ 75 కోట్లు చెల్లిస్తే.. అమితాబ్ బచ్చన్ 71 కోట్లు ట్యాక్స్ గా పే చేశారు. వీళ్ల తరువాతి మూడు స్థానాలు బాలీవుడ్ స్టార్స్ వే. వాళ్ల లిస్టు చూస్తే.. అజయ్ దేవగన్ – 42 కోట్లు, రణబీర్ కపూర్ – 36 కోట్లు, హృతిక్ రోషన్ – 28 కోట్లను ఆదాయపు పన్నుగా చెల్లించారు.

మన టాలీవుడ్ స్టార్స్ గురించి చూద్దాం. ఇందులో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఐకాన్ స్టార్ 2023-24లో ఏకంగా రూ.14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ 16వ స్థానం దక్కించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం. హీరోలతో పోలిస్తే.. ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు హీరోయిన్లు. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కరీనా కపూర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల పన్ను చెల్లించి జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక కియారా అద్వానీ 12 కోట్లతో 14వ స్థానంలో ఉంది. కత్రినా కైఫ్ 11 కోట్లు ట్యాక్స్ చెల్లించి టాప్ 20 లో స్థానం సంపాదించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.