Sai Pallavi: నేను అలా అనలేదు.. ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు.!
దక్షిణాది సినీ ప్రియులకు అభిమాన హీరోయిన్ సాయి పల్లవి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరూ సమానంగా ఇష్టపడే అతి కొద్దిమంది నటీమణులలో సాయిపల్లవి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అద్భుతమైన నటనతో మెప్పించింది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే అమరన్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే సాయి పల్లవి ప్రతీ సినిమా విడుదలకు ముందు ఏదోక విషయంలో ఆమె పై ట్రోల్స్ జరుగుతుంటాయి. గతంలో ఆమె మాట్లాడిన మాటలను మళ్లీ షేర్ చేస్తూ ఆమె పై విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన మాటలు ఎందుకు నెట్టింట ట్రోల్స్ చేస్తుంటారనే విషయంపై స్పందించింది.
కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఓ రిపోర్టర్‌పై తాను సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయని.. అవి చూసి తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది. కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా ఎక్కువని చెప్పింది. సాయిపల్లవిని ఇలా చూస్తున్నారంటే దానికి ‘ప్రేమమ్’ సినిమా కారణమంది. ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ తన దగ్గరకు వచ్చి మలయాళంలో మాట్లాడిందని చెప్పింది. అప్పుడు హఠాత్తుగా ‘అయ్యో సారీ, మలయాళంలో మాట్లాడితే నీకు కోపం రాదు కదా అని ప్రశ్నించిందని చెప్పింది. ఆ మాట విని మరింత బాధపడ్డానని.. తాను అలా అనలేదని ఆమెకు వివరణ ఇచ్చానంది. ‘ప్రేమమ్’ సినిమానే తనను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.