దోమల బాధ ఉందా ?? ఈ మొక్కలు పెంచి చూడండి
కాస్త మురుగు ఉంటే చాలు దోమలు ముసురుకుంటూ ఉంటాయి. చలికాలంలో అయితే ఫ్యాన్ వేస్తే ఒక బాధ.. వేయకుంటే దోమల రొద. కుట్టి కుట్టి చంపేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రానే రావంటున్నారు నిపుణులు. పైగా ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం అదనపు లాభాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.
దోమల మందులు, మస్కిటో కాయిన్స్ వంటి వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ ఉండవని స్పష్టం చేస్తున్నారు. దోమలను పారదోలే మొక్కల్లో లావెండర్ ఒకటి. అద్భుత సువాసనకు మారుపేరైన లావెండర్ దోమలను దూరం పెడుతుంది. దీని సువాసన మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. మంచి నిద్రకూ తోడ్పడతుంది. చర్మంపై గాయాలను, మొటిమలను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు ఇస్తుంది. అలాగే సిట్రోనెల్లా గ్రాస్ కూడా దోమలను దరి చేరనివ్వదు. ఈ నిమ్మగడ్డి దోమలనే కాదు ఇతర కీటకాలనూ దూరంగా ఉంచుతుంది. అదే సమయంలో మంచి సువాసననూ ఇస్తుంది. క్యాట్నిప్ మొక్కలు కూడా దోమలకు శత్రువులే. ఈ మొక్కలను పెంచితే పరిసరాల్లోకి దోమలు రాకుండా ఉంటాయి. బాసిల్ జాతికి చెందిన తులసి, ఇతర మొక్కలు కూడా దోమలు, కీటకాలను దూరం పెడతాయి. అంతేకాదు వాటి నుంచి మంచి సువాసన కూడా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
BSNL లో మరో అదిరిపోయే ప్లాన్.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

