Chiranjeevi: మరో యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా.. అనిల్ రావిపూడితో చిరంజీవి
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత దసరా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. అలాగే అనిల్ రావిపూడితోనూ సినిమా చేస్తున్నాడని టాక్.
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు.. వరుస సినిమాలను లైనప్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా ఈ సారి చిరంజీవి తన స్టైల్ మర్చి యంగ్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నారు. ప్రస్తుతం బింబిసార సినిమాతో హిట్ అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ సినిమా తర్వాత కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తాజాగా అనౌన్స్ చేశారు.
ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్
ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ మాస్ అవతార్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. . 2025 చివరి వరకు ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టా చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తారని తెలుస్తోంది. వెంకీ సినిమా తర్వాత చిరంజీవి సినిమా కథ పై వర్క్ చేస్తారని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.