Earthquake: భూకంపాల విషయంలో తెలుగురాష్ట్రాలు సేఫేనా..? మరింత పెరిగిన భయాలు
హైదరాబాద్‌కి భూకంప భయం ఉందా? విశాఖ, విజయవాడ ఏ జోన్‌లో ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భూకంపం వచ్చే అవకాశాలు ఎంత? డిటైల్డ్‌గా తెలుసుకుందాం పదండి...

తెలంగాణకు భూకంపాల భయాలేం లేవు.. మనది దక్కన్ పీఠభూమి.. సముద్రానికి ఎత్తులో ఉంటుంది.. నిర్భయంగా ఉండొచ్చని చెబుతుంటారు కొందరు. ఎవరు చెప్పారసలు తెలంగాణ భూకంపాల జోన్‌లో లేదని? దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. కావాలంటే ఆ లిస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలోని ఏరియాలు కూడా ఉంటాయి. మెయిన్‌గా హైదరాబాద్ ఉంటుంది. సో, హైదరాబాద్‌కు కూడా భూకంపం ముప్పు ఉంది. ఒక్క తెలంగాణ గురించే ఎందుకు చెప్పుకోవాలి? విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు.. ఇవన్నీ భూకంపాల జోన్‌లోనే ఉన్నాయి. కాకపోతే, జియోలజిస్టులు ఏం చెబుతారంటే.. తక్కువ, అతి తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే ప్రాంతాలు కాబట్టి అంతగా కంగారు పడక్కర్లేదు అని. అంతే తప్ప.. అసలు భూకంపాలు రానే రావు అని కాదు దానర్థం. ఇక.. మేడారం జాతర జరిగే ములుగు జిల్లాలో ఓ విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. పంచభూతాల్లోని నేల, నీరు, గాలి.. ములుగును పగబట్టాయా అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఓ వింత వాతావరణం, ప్రకృతి ప్రకోపం కనిపిస్తోందక్కడ. ఇంతకీ కారణం ఏంటి? భూకంపాల విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎంత వరకు సేఫ్? ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయి? హైదరాబాద్, విశాఖ నగరాలు సేఫ్‌గా ఉంటాయా? ఇవాళ్టి టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌లో అన్నిటికీ సమాధానాలు చెప్పుకుందాం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 దాటి రావడం అంటే.. కచ్చితంగా బిగ్‌బ్రేకింగ్ వేసి...
