ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్ వచ్చినా అదే రూల్.. వీడియో
చేతిలో మొబైల్, కాళ్లకు చెప్పులతో ఇంటి నుంచి బయటపడుతుంటారు జనాలు. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులేసుకుని తిరుగుతుంటారు. అలాంటిది ఓ గ్రామంలోని ప్రజలెవ్వరూ అస్సలు చెప్పులు ధరించరు. ఆ గ్రామ ప్రజలు ఊరిలోకి రావాలంటే.. పొలిమేరలోనే చెప్పులు విడిచిపెట్టి వస్తారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా.. ఇది ఆ ఊరిలోని ఆచారం.
ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది.? వారి సంప్రదాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి 50 కిమీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయితీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఈ గ్రామంలో మహా అయితే 10 నుంచి 15 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లలోని పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవ్వరూ కూడా చెప్పులు ధరించరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అస్సలు తినరు. ఎవరి ఇంట్లో నీళ్లు తాగరు. స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. ఎవరైనా వీరిని తాకినా వెంటనే స్నానం చేస్తారు. అలాగే ఇంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
