ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆఖరు తేదీ ఫిబ్రవరి 26కి మరికొద్ది రోజులే ఉండటంతో జనం విపరీతంగా పోటెత్తుతున్నారు. బీహార్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్న రైళ్ల కోసం రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆ మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర సేనానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లోని జయనగర్ నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.
మధుబని రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడం కోసం ప్రయాణికులు అప్పటికే స్టేషన్‌లో వేచి చూశారు. రైలు ఎక్కేందుకు భారీగా చేరుకున్నారు. అయితే, అప్పటికే రైలు పూర్తిగా నిండిపోయింది. కాలుతీసి కాలుపెట్టేందుకు కూడా చోటులేదు. టాయిలెట్ల బయట కూడా జనం కూర్చోవడంతో రద్దీ కారణంగా ఏసీ కోచ్‌ల తలుపులను అధికారులు తెరవలేదు. కొన్ని తలుపులు మాత్రమే తెరవడంతో కోచ్‌లలోకి రిజర్వేషన్ చేయించుకున్న కొందరు తోసుకుంటూ ఎక్కగలిగారు. కానీ చాలా మంది రద్దీ కారణంగా ఎక్కలేకపోయారు. వారంతా ఆగ్రహంతో రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు. రైలును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఆర్‌పీఎఫ్ పోలీసులు అప్రమత్తం కావడంతో గొడవ సద్దుమణిగాక రైలు గంట ఆలస్యంగా బయల్దేరింది.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో

మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..!

బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో
