మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో
ఇటీవల పుణ్యక్షేత్రాల్లో పులులు, ఎలుగుబంట్లు, పాముల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒక్కోసారి ఇవి భక్తులు, స్థానికులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ జంతువులు కనిపిస్తూ భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా మహానంది క్షేత్రంలో ఓ పెద్ద నాగుపాము హల్‌చల్‌చేసింది.
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్ చల్ చేసింది. ఆలయ ప్రాంగణంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అప్రమత్తం అయి, స్థానిక స్నేక్ స్నాచర్ మోహన్ సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. పడగవిప్పి బుసలుకొడుతూ ఏకంగా గంటపాటు స్నేక్ క్యాచర్ ను ముప్పు తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు ఆలయ గాలి గోపురం ముఖ ద్వారం వద్ద నాగుపామును బంధించారు. ఆలయం ముందు నాగుపాము బుసలు కొడుతూ ఉండటాన్ని చూసి భక్తులు ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణ చేశారు. అనంతరం స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఓక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలి పెట్టారు. దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
