అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు… ఓ బ్యాచిలర్ కష్టాల వీడియో
మహానగరాల్లో అద్దె ఇంట్లో ఉండాలంటే సగం జీతం అద్దెకోసమే వెచ్చిచాలి. బ్రతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినవారి కష్టాలు అంతా ఇంతాకాదు. ఇక సాఫ్ట్‌వేరు ఉద్యోగులైతే చెప్పనక్కర్లేదు. ఇక బెంగళూరులో జీవన వ్యయం చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఉద్యోగస్తులు నెలనెలా అందుకునే జీతంలో దాదాపు సగం ఇంటి అద్దెకే చెల్లించాల్సిన పరిస్థితి అంటూ వాపోతున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధపడినా కూడా అద్దెకు ఇల్లు అద్దెకు దొరకడంలేదంటున్నారు.
తాజాగా బెంగళూరులో అద్దె ఇంటి కష్టాలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నాడు. తాను అద్దెకుంటున్న సింగిల్ రూమ్‌కి సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గది మధ్యలో నిలుచుని చేతులు చాపితే అటుఇటూ గోడలు తగులుతున్న ఈ రూమ్ బహుశా బెంగళూరు మొత్తానికీ అత్యంత ఖరీదైనదేమో అంటూ కామెంట్ చేశాడు. ఈ చిన్న గదికి నెలకు రూ.25 వేలు అద్దె చెల్లిస్తున్నానని తన పోస్ట్‌లో తెలిపాడు. తన సమస్యలను ఎంతో ఫన్నీగా చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ చిన్ని గది వల్ల తను నెలనెలా తన జీతంలో చాలామొత్తం పొదుపు చేస్తున్నానని చెప్పాడు. గది చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ వస్తువులు కొనడం తప్పిందని, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు కొనాలనుకున్నా వాటిని ఉంచేందుకు స్థలం లేక ఆ ఆలోచన మానుకున్నట్టు చెప్పాడు. చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

