12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే!వీడియో
కింగ్ కోబ్రా.. పేరుకు తగ్గట్టుగానే భారీగా, పొడవుగా చెట్టంత ఎత్తుకు ఎగసి మరీ బుసలు కొడుతుంది. దీని పేరు చెబితేనే ఒంట్లో వణుకు పుడుతుంది. మరి ప్రత్యక్షంగా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. వీటిని గిరినాగు, రాచనాగులని కూడా అంటారు. ఇవి తరచూ అనకాపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఓ భారీ గిరినాగు అనకాపల్లి జిల్లాలో ప్రజలను పరుగులు పెట్టించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. టేకు తోటల్లో నుంచి.. ఓ ఇంటి వాష్ రూమ్‌లో చొరబడింది. బుసలు కొడుతూ భయపెట్టింది.
శబ్దాలు విని ఏమై ఉంటుందా అని పరిశీలించిన ఆ ఇంటివారు భారీ నాగుపామును చూసి భయంతో వణికిపోయారు. చీడికాడ మండలం చీడిపల్లిలోని ఓ ఇంట్లో 12 అడుగుల రాచనాగు తిష్టవేసుకుని కూర్చుంది. భారీ గిరినాగును చూసి, భయభ్రాంతులకు గురైన ఆ ఇంటివారు స్థానికులు, స్నేక్ క్యాచర్, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సభ్యులు.. పామును బంధించేందుకు చాలా శ్రమపడ్డారు. గిరినాగును బంధించే క్రమంలో స్నేక్ క్యాచర్‌పై దాడికి యత్నించింది ఆ భారీ కింగ్ కోబ్రా. ఎట్టకేలకు ఆ 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
