PM Modi: మనం నాటిన విత్తనం.. నేడు మర్రి చెట్టుగా మారుతోంది: ప్రధాని మోదీ
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 'భారత్ టెక్స్ 2025' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా మనం ఉన్నామని తెలిపారు. మన వస్త్ర ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పుడు లక్ష్యం 2030 నాటికి దీనిని రూ. 9 లక్షల కోట్లకు తీసుకెళ్లడమేనని స్పష్టం చేశారు.

భారతదేశం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమన్నారు. మా దృష్టి సాంకేతిక వస్త్ర రంగంపై ఉందన్న ప్రధాని, ఈ రంగంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంటోందని అన్నారు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం(ఫిబ్రవరి) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్ 2025 కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ మండపంలో మనం నాటిన విత్తనం ఇప్పుడు మర్రి చెట్టుగా మారే మార్గంలో ఉందని అన్నారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు. టెక్స్‌టైల్ పరిశ్రమ నాయకులు భాగస్వామ్యం చేసుకోవడానికి, సహకరించుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి స్థానికం నుండి ప్రపంచానికి వెళ్ళే అవకాశం లభిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
భారత్ టెక్స్‌టైల్ రంగం ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 120 కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. కేవలం రూ.75 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నందున, బ్యాంకింగ్ రంగం వస్త్ర పరిశ్రమకు మద్దతు అందించాలని ఆయన కోరారు.
గత సంవత్సరం భారతదేశ వస్త్ర, దుస్తుల ఎగుమతులు ఏడు శాతం వృద్ధిని నమోదు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం, భారతదేశం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. 2030 నాటికి ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుండి రూ.9 లక్షల కోట్లకు పెంచడమే మా లక్ష్యం. మా దృష్టి సాంకేతిక వస్త్ర రంగంపై ఉందని, ఈ రంగంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంటోందని ఆయన అన్నారు. భారతదేశం అధిక-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ వైపు పయనిస్తోందని, వస్త్ర రంగానికి నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల సమూహాన్ని సృష్టించడానికి కృషి చేస్తోందని ప్రధాన మంత్రి తెలియజేశారు.
గత సంవత్సరం భారత్ టాక్స్‌లో చేరిన తర్వాత, కొత్త కొనుగోలుదారులు పెద్ద ఎత్తున దొరికారని, వ్యాపారం విస్తరించిందని కొంతమంది చెప్పారని ఆయన అన్నారు. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మేము దానిని తీర్చలేకపోతున్నామన్న ప్రధాని, బ్యాంకింగ్ రంగ సంస్థలు వస్త్ర రంగంలో పెట్టుబడి, ఇతర అంశాలను ప్రోత్సహించాలని సూచించారు. భారత్ టెక్స్ కార్యక్రమంలోని దుస్తుల ద్వారా కూడా సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇదే సరైన సమయం; మన వైవిధ్యం, ప్రత్యేకత ఇటువంటి కార్యక్రమాల ద్వారా వస్త్ర పరిశ్రమను విస్తరించడానికి ఒక మాధ్యమంగా మారాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




