AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి.. టీమిండియా దెబ్బకు ఆస్ట్రేలియా బుర్ర ఖరాబ్.. అదేంటంటే?

India Breaks Australia ICC Finals Record: ఇంగ్లాండ్ జట్టుపై ఉత్కంఠ విజయంతో భారత జట్టు ఫైనల్ చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసింది. కాగా, ఈ విజయంతో భారత జట్టు మార్చి 8న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టనుంది.

క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి.. టీమిండియా దెబ్బకు ఆస్ట్రేలియా బుర్ర ఖరాబ్.. అదేంటంటే?
Team India
Venkata Chari
|

Updated on: Mar 06, 2026 | 11:00 AM

Share

India Breaks Australia ICC Finals Record: టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ జట్టుపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన, హై స్కోరింగ్ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో భారత్ రెండు అరుదైన రికార్డులు సృష్టించింది.

క్రికెట్ చరిత్రలో తొలిసారి..

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) 89 పరుగులు, శివం దుబే (Shivam Dube) 43 పరుగులతో కీలక పాత్ర పోషించారు. ఛేజ్‌లో ఇంగ్లాండ్ తరపున జాకబ్ బెథెల్ (Jacob Bethell) అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

ముఖ్యంగా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. 2024లో టైటిల్ గెలిచిన భారత్ ఇప్పుడు మరోసారి ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశాన్ని పొందింది.

ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్ బ్రేక్..

ఈ విజయంతో భారత్ మరో చారిత్రాత్మక ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరిన జట్టుగా భారత్ నిలిచింది. భారత్ ఇప్పటివరకు 15 ఐసీసీ ఫైనల్స్ ఆడింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆ జట్టు 14 ఫైనల్స్ ఆడింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ అధిగమించింది.

ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోరు..

ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరగనుంది. న్యూజిలాండ్ ఇప్పటివరకు 8వసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడబోతోంది. అయితే, వారికి ఇంకా టీ20 వరల్డ్ కప్ టైటిల్ దక్కలేదు. భారత్ మాత్రం వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us