AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజిటల్ అరెస్ట్ అంటూ భర్తకు ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే..

ఈడీ, పోలీసు అధికారుల పేరు చెప్పి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.. దీనిపై పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అరెస్టు పేరుతో ఫోన్ చేస్తే.. తమ దృష్టికి తీసుకురావాలంటూ సూచిస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్ అంటూ భర్తకు ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే..
Digital Arrests
P Shivteja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 04, 2024 | 8:38 PM

Share

ఈడీ, పోలీసు అధికారుల పేరు చెప్పి డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.. దీనిపై పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అరెస్టు పేరుతో ఫోన్ చేస్తే.. తమ దృష్టికి తీసుకురావాలంటూ సూచిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ మహిళ చాకచక్యంగా వ్యవహరించి.. డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టిన సైబర్ నేరగాళ్ల మోసాన్ని భగ్నం చేసింది.. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వివాహిత చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సైబర్ నేరగాళ్ల కుట్రను అడ్డుకోగలిగారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి(50)కి మంగళవారం ఉదయం సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ‘ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్ శర్మ’ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈడీ, పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు.. సహకరించండి’ అంటూ కాల్ కట్ చేశారు. వెంటనే వీడియో కాల్ ద్వారా ‘ముంబయి ఎస్పీ ప్రదీప్’నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కదలకుండా కూర్చోవాలని, మీ భార్యను పిలవాలని, ఇంటి తలుపులు మూసేసి.. ఎక్కడికీ వెళ్లకూడదని షరతులు విధించాడు. అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు.

అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగొస్తానని గది నుంచి బయటకు వచ్చి డయల్-100కు ఫోన్ చేసి విషయం చెప్పింది.. వెంటనే స్పందించిన పట్టణ ఎస్సై కాశీనాథ్ స్థానిక సైబర్ వారియర్ రషీద్ తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి పది నిమిషాల్లో పంపించారు. వారిని గమనించిన కేటుగాడు.. ఎవరొచ్చారు.. ఎందుకొచ్చారు అంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు.

వీడియో చూడండి..

పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ సైబర్ మోసగాళ్ల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని డిజిటల్ అరెస్టులు, విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్, వీడియో కాల్స్ ను నమ్మొద్దని, పోలీసు, ఈడీ అధికారులెవరూ డిజిటల్ అరెస్టులు చేయరని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కాశీనాథ్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..