Pushpa 2: పుష్ప 2 విడుదలకు ముందే బన్నీకి సర్‏ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. డియర్ నాన్న అంటూ..

ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పుష్ప 2 ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు రాబోతుంది. మరికొద్ది గంటల్లో ఈసినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో బన్నీకి అయాన్ క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడు.

Pushpa 2: పుష్ప 2 విడుదలకు ముందే బన్నీకి సర్‏ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. డియర్ నాన్న అంటూ..
Allu Arjun, Ayaan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 04, 2024 | 9:58 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక ఈరోజు రాత్రే కొన్ని చోట్ల ప్రీమియర్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లోనే పుష్పరాజ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. పుష్ప 2 రిలీజ్ వేళ తండ్రికి క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడు అల్లు అయాన్.

పుష్ప 2 విడుదలకు ముందు తన తండ్రి అల్లు అర్జున్ కు తన కష్టాన్ని మర్చిపోయేలా.. తన ప్రేమను తెలియజేస్తూ స్వహస్తాలతో ఓ క్యూట్ లెటర్ రాశాడు. ఆ లెటర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు బన్నీ. ఆ లేఖలో ఏముందంటే.. “డియన్ నాన్న.. ఈ క్షణంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో.. ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో చెప్పేందుకే ఈ లేఖను రాస్తున్నాను. నీ కష్టం, డెడికేషన్, హార్డ్ వర్క్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు నాకు ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులోనే కనిపిస్తుంటావు. ఈరోజు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. నీకు ఇప్పుడు ఎలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయ్ నాకు తెలుసు. నీకు పుష్ప అనేది కేవలం సినిమా కాదు. అదో ప్రయాణం అని నాకు తెలుసు. నటనపట్ల నీకున్న ప్యాషన్ కు పుష్ప నిదర్శనం. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న.. నువ్వు నాకు నిజమైన హీరోవి నాన్న.. నీకు అనంతమైన అభిమాన గణం ఉంటుంది. పుష్పు అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు.. వైల్డ్ ఫైర్.. ఇది ప్రపంచంలోని ఓ ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు… ఓ ఐడల్. నాన్నకి ప్రేమతో రాస్తున్న లేఖ” అని అయాన్ తన తండ్రిపై ప్రేమను బయటపెట్టాడు.

ప్రస్తుతం అయాన్ రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు బన్నీ. ఇక అయాన్ రాసిన లేఖ చూసి ఆశ్చర్యపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. దాదాపు మూడేళ్లుగా పుష్ప 2 కోసం కష్టపడ్డారు సుకుమార్, అల్లు అర్జున్. 2021లో పుష్ప 1తో సంచలనం సృష్టించిన వీరిద్దరి కాంబో.. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు రాబోతున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.