Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్

పుష్ప 2 సినిమా కోసం దేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ బద్దలుకొడతాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.

Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్
Allu Arjun, Pawankalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2024 | 1:15 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5( గురువారం)రోజున విడుదల కానుంది.  ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంపై అల్లు అర్జున్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో మాత్రం పుష్ప సినిమా టికెట్ ధరలు పెరిగాయి. అక్కడ ప్రభుత్వం అంగీకరిస్తేనే సినిమా టిక్కెట్ల ధరను పెంచవచ్చు. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లోనే ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ‘పుష్ప 2’ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని అన్నారికీ తెలుసు. సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు బాగా తెలుసు. ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలని ఆయన ఎప్పుడు చూస్తుంటారు..కాగా ‘పుష్ప 2’ భారీ బడ్జెట్ సినిమా. నిర్మాతలకు లాభాలు రావాలి కాబట్టి సినిమా మరింత కలెక్ట్ చేయాలి. దీంతో తమ ప్రభుత్వం టికెట్ ధరను పెంచేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ విషయమై అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ, ‘టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు  అలాగే  చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో మీ అమూల్యమైన మద్దతుకు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.