Hari Hara Veera Mallu: మీసం తిప్పిన పవన్ కళ్యాణ్.. హరిహరవీరమల్లు వచ్చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు సినిమా ఒకటి ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2024 | 1:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వైపు సినిమాలతోనూ బిజీ కానున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఆయన లైనప్ చేసిన సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా పవన్ హరిహరవీరమల్లు మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మదలైంది.. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి పవన్ ఫోటో షూట్ కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇందులో పవన్ మీసం తిప్పుతూ కనిపించారు.