కోలీవుడ్ ప్రొడ్యూసర్లకి షాక్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు.. విషయం ఏంటంటే
కోలీవుడ్ ప్రొడ్యూసర్లకి ఊహించని షాక్ తగిలింది. సినిమా రివ్యూలను నిషేదించాలని మద్రాసు హైకోర్టును కోరారు నిర్మాతలు.. రివ్యూలపై పూర్తిగా నిషేధం కోరిన నిర్మాతల మండలికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.
తమిళ సినీ పరిశ్రమలో రివ్యూలపై వివాదం నడుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత మీడియాలో ప్రేక్షకుల నుంచి స్పందన పేరుతో ఇచ్చే రివ్యూల ద్వారా తమకు కలెక్షన్ల విషయంలో భారీగా నష్టం వాటితోందని నిర్మాతలు మండలి ప్రతిరోజులుగా అభ్యంతరం తెలుపుతోంది. చాలా కాలం నుంచి ఈ అంశంపై అభ్యంతరాలు ఉండగా ఇవాళ విడుదలై మోస్ట్ డిజాస్టర్ గా నిలిచిన కంగువా విడుదల తర్వాత రివ్యూల విషయాన్ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు. సుమారు 400 కోట్లతో తొడకెక్కిన సూర్య నటించిన కంగువా భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం మోస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సగటు సినీ అభిమాని విషయం పక్కనపెడితే సూర్య వీరాభిమానులకు సైతం సినిమా ఏమాత్రం నచ్చకపోవడంతో అందరూ నిరుత్సాహం లో మిగిలిపోయారు.. ఈమధ్య విడుదలైన కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 కూడా భారీ మెజాస్టర్ గా నిలిచింది. అలాగే తమిళ సినీ పరిశ్రమలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరైన అజిత్ సినిమాలు మినిమం గ్యారంటీగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటిది అజిత్ సినిమాలు సైతం ఇటీవల భారీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో కోలీవుడ్ దర్శక నిర్మాతల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. సినిమా సక్సెస్ కావడానికి అందులో మినిమం స్టఫ్ గా ఉండాల్సిన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయా లేవా అన్నది పక్కనపెట్టి సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్ద ప్రేక్షుకల అభిప్రాయాల పేరుతో వచ్చే రివ్యూస్ ద్వారా నెగిటివ్ కామెంట్స్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కలెక్షన్లలో భారీ తేడా ఉంటుంది అనేది నిర్మాతలు లేవనెత్తుతున్న అంశం. కనీసం సినిమా విడుదలైన వారం రోజులు పాటు సినిమాల్లో ఉన్న మైనస్ ఏంటనేది బయటకు రాకుంటే విడుదలైన సినిమాలు మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా నష్టపోకుండా ఉంటాం అనేది నిర్మాతలు చెబుతున్న మాట. కాంగువ సినిమా టాక్ విషయంలో రివ్యూల పేరుతో ప్రేక్షకులను థియేటర్లకు రానివ్వకుండా చేయడంలో నెగిటివ్ టాక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే తమకు తీవ్ర నష్టం జరిగిందనేది నిర్మాణ సంస్థ చెబుతోంది. ఇటీవల కారణంగా రిలీజ్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే గజాస్టర్ గా మిగిలిన చిత్రాల నిర్మాతలు కూడా ఇదే అంశాన్ని గట్టిగా సమర్థిస్తూ నిర్మాతలు అందరూ కలిసి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
అదేంటంటే సినిమా రిలీజ్ అయిన థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుంచి సినిమా టాకు ఎలా ఉంది అన్నది తీసుకోవడం పై నిషేధం విధించాలని నిర్మాతలు అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత మరుసటి రోజు ఇచ్చే రివ్యూల కంటే థియేటర్ల వద్ద బయటికి వచ్చిన ప్రేక్షకులు సినిమాలోని మైనస్ లు బయట పెట్టడం వల్ల టీవీల్లో సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు రావడం లేదనేది నిర్మాతల అభిప్రాయం. అందుకే థియేటర్ల వద్ద ఎలాంటి అభిప్రాయ సేకరణ జరగకూడదని అందుకోసం థియేటర్ల యాజమాన్యాలు సహకరించాలని నిర్మాతల మండలి కోరింది. ఎందుకు థియేటర్ల యాజమాన్యాల సైతం అంగీకరించాయి. గతంలోల థియేటర్ కాంపౌండ్ లోకి మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు షూట్ చేయడానికి అనుమతి లేదని ప్రకటన చేశారు. నేను పై నిర్మాతల మండలి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కొత్తగా విడుదలైన సినిమాలపై రివ్యూలు ఇవ్వకుండా నిషేధం విధించాలని ఆదేశాల కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ విచారణ జరిగింది. నిర్మాతల మండలి అభ్యర్థులను మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి మీకు నష్టం వాటిల్లినట్టు ఆధారాలు ఉంటే వాటిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్ప నేరుగా రివ్యూ ఇవ్వద్దంటూ స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. రివ్యూ ఇచ్చేటప్పుడు పాటిస్తున్న మార్గదర్శకాలు పై వివరణ ఇవ్వాలని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూడా నోటీసులు జారీ చేసి దీనిపై పూర్తి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రివ్యూలపై పూర్తిగా నిషేధం కోరిన నిర్మాతల మండలికి మద్రాస్ హైకోర్టులో నిరాశే ఎదురైంది.