Hrithik Roshan: రాంగ్ రిలేషన్ షిప్ అని తెలుకోవడానికి చాలాకాలం పట్టింది.. హృతిక్ మాజీ భార్య కామెంట్స్
నాగ చైతన్య, సమంత దగ్గర నుంచి రీసెంట్ గా విడిపోయిన జయం రవి, ఆర్తి వరకు అందరూ అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ లోనూ చాలా మంది విడిపోయారు. అలాంటి వారిలో హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ జంట కూడా ఉన్నారు.
ఈ మధ్య ఎక్కడ చూసిన బ్రేకప్ లు, విడిపోవడాలే కనిపిస్తున్నాయి. స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఊహించని విధంగా విడిపోతున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ షాక్ ఇస్తున్నారు. నాగ చైతన్య, సమంత దగ్గర నుంచి రీసెంట్ గా విడిపోయిన జయం రవి, ఆర్తి వరకు అందరూ అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ లోనూ చాలా మంది విడిపోయారు. అలాంటి వారిలో హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ జంట కూడా ఉన్నారు. చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. నటుడు హృతిక్ రోషన్ విషయంలో కూడా అలానే జరిగింది. హృతిక్ అతని మొదటి భార్య సుస్సానే ఖాన్ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో, అభిమానుల్లో చాలా చర్చలు జరిగాయి.
2014లో హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత హృతిక్, సుస్సానే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా సుస్సానే హృతిక్‌ని ప్రేమగానే ఉంటారు. విడాకుల తర్వాత ఇద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు. ఇది కాకుండా, ఇద్దరు కూడా తమ కొడుకుతో కలిసి తమ వెకేషన్‌లను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ఇదిలా ఉండగా, విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత అంటే 2016లో సుస్సానే విడాకులకు కారణాన్ని చెప్పింది. ‘మేము విడిపోవాలని నిర్ణయించుకునే స్థాయికి వచ్చాము. విడిపోవడమే సరైన నిర్ణయం’ అని సుస్సానే చెప్పింది. విడాకుల తర్వాత సుస్సానే మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు రాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాం.. నిజం తెలుసుకుని కలిసి ఉండటం వల్ల ప్రయోజనం లేదు…’ అని చెప్పింది. ఇది మాత్రమే కాదు, సుస్సానే, హృతిక్ విడాకులు ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకులు అని కూడా చర్చ జరిగింది. హృతిక్ సుస్సానేకి భరణంగా రూ.400 కోట్లు ఇచ్చాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్స్ కేవలం అవాస్తవమే అని హృతిక్ చెప్పాడు. విడాకుల తర్వాత సుస్సానే మరియు హృతిక్ కూడా తమ జీవితాలను కొనసాగించారు. సుస్సానే నటుడు, మోడల్ అర్సెనల్ గోనితో డేటింగ్ చేస్తోంది. హృతిక్ రోషన్ గాయని, నటి సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. నలుగురూ చాలాసార్లు కలిసి కనిపించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.