ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??

ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??

Phani CH

|

Updated on: Dec 04, 2024 | 1:13 PM

ట్రైన్లలో చాలా మంది రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకుని రోజుల కొద్దీ ప్రయాణం చేస్తుంటారు. ఆ క్రమంలో వారికి రైళ్లలో పలు రకాల సౌకర్యాలు కల్పిస్తారు. వాటిలో దుప్పట్లను అందించడం కూడా ఒకటి. అయితే ఈ దుప్పట్లను నెలకు ఎన్ని సార్లు ఉతుకుతారనే ప్రశ్నను ఇటీవల పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రైల్వే మంత్రిని అడిగారు.

రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను భారతీయ రైల్వే నెలకు కనీసం ఒకసారైనా ఉతుకుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. బెడ్‌రోల్ కిట్‌లో మెత్తని కవర్‌గా ఉపయోగించేందుకు అదనపు షీట్‌ను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. దుప్పట్ల కోసం ప్రయాణికులు అదనంగా చెల్లిస్తుండగా, రైల్వే నెలకు ఒకసారి మాత్రమే ఉన్ని దుప్పట్లను ఉతుకుతుందా అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాచారం ఇచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని రైల్వే మంత్రి తెలిపారు. నాణ్యతను నిర్ధారించే BIS ధృవీకరణతో లినెన్‌ దుప్పట్ల సేకరణ, సరఫరా ను మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం ఉంటాయని చెప్పారు. అంతేకాదు ఉతికిన లినెన్‌ దుప్పట్ల నాణ్యతను తనిఖీ చేయడానికి వైటో మీటర్‌ని ఉపయోగిస్తారని వైష్ణవ్ తెలిపారు. రైల్‌ మదద్‌ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు రైల్వే జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలో ‘వార్ రూమ్’లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీని ప్రకారం ఎలాంటి ఫిర్యాదులైనా కూడా తక్షణమే పరిష్కరించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సమాధానం చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బెడ్‌ షీట్లను నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కొంతమంది కోరారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్

TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్

Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలోకి విశిష్ట అతిథి..