Rajitha Chanti |
Updated on: Dec 04, 2024 | 10:15 PM
అక్కినేని వారింట పెళ్లి బాజా మోగింది. హీరో నాగచైతన్య వివాహం శోభిత ధూళిపాళ్లతో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ వేడుక జరిగింది.
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, టి. సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్దరాత్రి వరకూ ఈ వివాహ వేడుకలు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నాగార్జున షేర్ చేశారు.
ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేడుకలో శోభితను మొదటిసారిగా కలుసుకున్నానని.. ఆమె మంచి మనసు తనను చాలా నచ్చిందని ఇటీవల చైతన్య తెలిపారు.