స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతున్న సోనాల్ చౌహాన్

Phani CH

04 December 2024

సోనాల్ చౌహాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. పేరుకు బాలీవుడ్ భామ అయిన టాలీవుడ్ లో స్థిరపడిందనే చెప్పాలి.

కేవలం హిందీకి మాత్రమే పరిమితం కాకుండా అటు తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

బాలీవుడ్ లో ఈమె మొదటి చిత్రం జన్నత్ కాగా.. 2008 లో వచ్చిన రెయిన్‌బో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ..

అయితే  ఒక్కమాటలో చెప్పాలంటే ఈమెకి బాలయ్య బ్యూటీగా మార్క్ వేశారు హార్డ్‌కోర్ అభిమానులు. ఎందుకంటే బాలకృష్ణ సరసన మూడు సినిమాలు చేసింది.

లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాలు చేసింది ఆగ్రా బ్యూటీ. గతేడాది థియేటర్ వచ్చిన బైలింగ్వల్ మూవీ ఆదిపురుష్‌లో సత్తా చాటింది.

ఆ తర్వాత పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో వంటి పలు సినిమాల్లో నటించగా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడినాయి అనే చెప్పాలి.

అప్పట్లో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో కొత్త బ్యూటీల రాకతో సోనాల్‌కి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి..