ఈ నీరు అమృతం కన్నా ఎక్కువ.. సర్వ రోగ నివారిణి

Phani CH

04 December 2024

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముఖ్యంగా కాలేయం ఆరోగ్యం కోసం చాలా మంది ఇప్పుడు డిటాక్స్ డ్రింక్స్‌పై ఆధారపడుతున్నారు. 

అలాంటి డిటాక్స్ డ్రింక్స్ లో బార్లీ నీరు కూడా ఒకటి. కానీ ఈ ధాన్యాన్ని ఉపయోగించి డిటాక్స్ వాటర్ తయారు చేసే విధానం కాస్త ఆధునికమైంది. కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్‌, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దీంతో శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

బార్లీ గింజలను రాత్రంతా నానబెట్టి మరిగించి ఆ నీటిని తాగాలి. లేదా బార్లీ పొడిని నేరుగా మరిగించి తాగాలి.. ఇలా డీటాక్స్‌ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

రెగ్యులర్ గా గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగవచ్చు. ఇందులోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. 

డీహైడ్రేషన్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది. బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరంలోని కాలుష్య కారకాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు కూడా ఎలాంటి కాలుష్య కారకాలు పేరుకుపోకుండా చూస్తాయి. 

ఇది కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బార్లీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

బరువు తగ్గాలనుకున్న వారు బార్లీ నీరు రెగ్యులర్ గా తాగితే మంచి ఫలితం ఉంటుంది.. అలాగే ఉదయం, మధ్యాహ్నం జిమ్‌కి వెళ్లేవారు బార్లీ వాటర్‌ను తాగవచ్చు. 

బార్లీ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను గ్రహిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే బార్లీ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.  

బార్లీలో ఫైబర్ అధికంగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.