ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Phani CH

|

Updated on: Dec 04, 2024 | 3:10 PM

ఏపీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు కాస్త ఊరట కలిగించే అంశంగానే చెప్పవచ్చు. శీతాకాలం ప్రారంభమైందో లేదో చలి పంజా విసురుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సు సర్వీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సీట్లు ఫుల్ కాకుండానే అలానే వెళ్లాల్సి వస్తోంది.

దీంతో ఏసీ బస్సులపైన చలి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవో లకు అప్పగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గించారు. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10 శాతం తగ్గించారు. ఆదివారం నాడు హైదరాబాద్ కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూటులో చార్జీ తగ్గింపు లేదని తెలిపారు..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??

మ్యాచ్‌ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!

12 అడుగుల పాము.. చూస్తేనే హడల్

ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??

నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్