మ్యాచ్ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!
మృత్యువు నీడలా వెంటే ఉంటుందంటే ఇదేనేమో.. ఎంతో ఆరోగ్యంగా ఉండి, అప్పటివరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. చలికాలం స్టార్టింగ్‌లోనే గుండెపోటు పంజా విసురుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎటాక్ చేస్తోంది. గుండెపోటుతో చిన్నారులనుంచి, యువకులు, వృద్ధుల వరకూ పిట్టల్లా రాలిపోతున్నారు.
తాజాగా ఓ క్రికెటర్ క్రీజ్‌లోనే కుప్పకూలిపోయాడు. పుణె వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు నిర్జీవంగా మారడంతో సహచరులంతా బాధలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన అనంతరం అతడు డగౌట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొద్దిదూరం వెళ్లగానే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు, ప్రేక్షకులు హడలెత్తిపోయారు. ఆ మ్యాచ్ లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండటంతో వీడియోలు బయటకు వచ్చేశాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తోటి క్రికెటర్ మృతి చెందడంపై సహచరులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 అడుగుల పాము.. చూస్తేనే హడల్
ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??
నడి సముద్రంలో ఇంజనీరింగ్ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్
TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్