వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??

వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 04, 2024 | 3:09 PM

వాట్సాప్ మెటా యాజమాన్యంలోని ప్రసిద్ధ మెసేజింగ్ అప్లికేషన్ నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. 90 శాతం మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు వినియోగదారులకు అనుకూలమైన ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. వాట్సాప్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది.

అయితే ఈ యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. మనం అలాంటి ఒక ఫీచర్‌ గురించి తెలుసుకుందాం. వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఒక్కోసారి ఒకే సందేశాన్ని చాలా మందికి పంపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక్కొక్కరి చాట్‌లను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మెసేజ్ పంపుతుంటారు. అలా కాకుండా ఈ ఆప్షన్‌ ఉపయోగించి ఒకేసారి అందరికి పంపే వేసులుబాటు ఉంది. దీని కోసం మీరు ఒక చిన్న ట్రిక్ తెలుసుకోవాలి. యూజర్ సౌలభ్యం కోసం వాట్సాప్ యాప్‌లో ప్రసార జాబితాల ఫీచర్ అందుబాటులో ఉంది. గ్రూప్‌ను క్రియేట్ చేయకుండానే ఒకేసారి 256 మంది వరకు మెసేజ్‌లు పంపేందుకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యాచ్‌ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!

12 అడుగుల పాము.. చూస్తేనే హడల్

ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??

నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్

TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్