Ongole: వామ్మో.. ఒంగోలులో దెయ్యం.. జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..

మద్యం మత్తులో ముగ్గురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చీర కట్టుకుని వారికి ఓ మహిళ కనిపించిదట. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా.. అరుపులు, పెడ బొబ్బలతో వారిపై అటాక్ చేసిందట....

Ongole: వామ్మో.. ఒంగోలులో దెయ్యం.. జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..
Ghost Photo
Follow us
Fairoz Baig

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2024 | 9:28 PM

అర్దరాత్రి… చిమ్మ చీకటి… నగరానికి దూరంగా ఓ ముగ్గురు యువకులు మద్యం మత్తులో జోగుతూ బైక్‌పై వెళుతున్నారు… మద్యం మత్తు చాలదన్నట్టు అంతకు మించి మత్తిచ్చే మత్తుపదార్ధాల కోసం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వచ్చారు… ఎప్పుడూ లేని విధంగా ఓ భయంకరమైన అనుభవం వారికి ఎదురైంది… హఠాత్తుగా జుట్టు విరబోసుకుని, భయంకరంగా ఉన్న రూపంతో ఓ స్త్రీ వీరి బైక్‌కు ఎదురొచ్చింది… రౌద్రంగా చూస్తూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ… రా… రావాలయ్యా… నువు కావాలయ్యా… రా, రా… అంటూ పెడబొబ్బలు పెట్టింది… ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ఆ యువకులు భయపడుతూనే బైక్‌ హెడ్‌లైట్‌ వెలుతురులో ఫోటోలు తీశారట… వీడియో రికార్డింగ్‌ చేశారట… సర్కులేట్ అవుతున్న ఫోటోలు అంత స్పష్టంగా లేవు… అయితే ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా దడుసుకుని చావాల్సిందే… ఆ ఫోటోలు రాంగోపాలవర్మ దెయ్యం సినిమాలో కన్నా భయంకరంగా ఉన్నాయి… వీడియో మాత్రం లైటింగ్‌ లేక చీకటిగా ఉంది కానీ, ఆ స్త్రీ ఏడుపులు, పెడబొబ్బలతో సృష్టించిన బీభత్సం మాత్రం రికార్డయింది… తనంటే భయం లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఆ ముగ్గురు యువకులపై ఆ స్త్రీ ఒక్క ఉదుటున వారిపై లంఘించిందట… ఓ యువకుడి చేతిని, కాళ్ళను కండలు ఊడేలా కోరికేసిందట… దీంతో దెబ్బకు మత్తు దిగిపోయి సుస్సు పోసుకున్న ఆ యువకులు తమను దెయ్యం వెంటాడిందని భావించి ప్రాణభయంతో పరుగులు పెట్టారు… బతుకుజీవుడా అనుకుంటూ అక్కడినుంచి పరారయ్యారట… ఆ ప్రాంతం నుంచి ఎలా బయటపడ్డారో వారికే తెలియకుండా హైవేపైకి వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చేశారు… తీవ్ర గాయాలపాలైన యువకుడ్ని ప్రయివేటు ఆసుపత్రికి చేర్చేందుకు మిగిలిన ఇద్దరూ ప్రయత్నించగా వారి గాయాలు చూసి భయపడిన ప్రయివేటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు… ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పోలీసులు వస్తారన్న భయంతో యువకులు అక్కడినుంచి వెళ్ళిపోయారట… ఇదీ గత రెండు రోజులుగా ఒంగోలులో ఇంజనీరింగ్ విద్యార్దుల్లో హల్‌ చేస్తున్న దెయ్యం కహానీ…

Attck

విద్యార్థులపై దెయ్యం దాడికి సంబంధించినవిగా సర్కులేట్ అవతున్న ఫోటోలు

దెయ్యామా …. భయమా…?

ఒంగోలు నగరానికి సమీపంలోని సూరారెడ్డిపాలెం రైల్వే గేటు సమీపంలో ఓ ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్దులు మద్యం ఫుటుగా సేవించి అది చాలదన్నట్టు మరింత కిక్కిచ్చే మత్తుపదార్ధాల కోసం బైక్‌పై వచ్చారు… అదే సమయంలో నిర్మానుష్యంగా ఉన్న మట్టిరోడ్డుపై ఓ స్త్రీ జుట్టు విరబోసుకుని కనిపించింది… వెంటనే భయంతో ఆ ముగ్గురు విద్యార్ధులు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించారు… అయితే ఆ స్త్రీ వీరిని వెంబడించి భయంకరంగా అరుస్తూ, చేతికందిన ఓ యువకుడ్ని కరిచేసిందట… వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు యువకులు నగరానికి సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళారు… మద్యం మత్తులో ఉన్న ఆ యువకుల మాటలు, చేతలు చూసిన వైద్య సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీస్తే ఇదంతా దెయ్యం చేసిందని చెప్పారట… వీరి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని ప్రయివేటు వైద్య సిబ్బంది సూచించడంతో అ ముగ్గురు విద్యార్దులు అక్కడి నుంచి వెళ్ళిపోయారట… ప్రస్తుతం ఈ విద్యార్దులు ఎదుర్కొన్న అనుభవాలు, దెయ్యం ఎపిసోడ్‌ గురించి ఒంగోలు ఇంజనీరింగ్ విద్యార్దుల సర్కిల్లో తెగ ప్రచారాలు నడుస్తున్నాయి… నిజంగా దెయ్యం ఉందంటారా… ఈ కథనం, ఫోటోలు చూసిన తరువాత అనుభవజ్ఞులైన పాఠకులే చెప్పాలి.

దెయ్యం కనిపించినట్లుగా ఒంగోలులో సర్కులేట్ అవుతున్న వీడియో

అయితే టీవీ9 రీసెర్చ్‌లో ఈ ఫోటోలు, వీడియోలు ఫేక్ అని తేలింది. దెయ్యం అంటూ ఏడాది క్రితం తమిళనాడులో కూడా ఈ ఫోటోలు, వీడియోలను సర్కులేట్ చేశారు. మరి యువకులకు పంజాతో దాడి చేసినట్లుగా ఆ గాయాలు ఎలా అయ్యాయి… ఇది వారి కట్టుకథా లేక ఏదైనా ప్రాంక్ ఇలా ప్లాన్ చేశారా అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..