హెవీ సైలెన్సర్లు వాడుతున్నారా ?? అయితే రోడ్డు రోలర్ తొక్కేస్తుంది జాగ్రత్త
జిల్లాలో 6 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 ద్విచక్ర వాహన సైలెన్సర్లను, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన సైరన్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో తొక్కించారు.
ఇంకో సారి ఇలాంటి సైలెన్సర్స్ కనబడుతే.. తాట తీస్తామని పోలీసులు హెచ్చరించారు.. ఈ చర్యలు..సిరిసిల్ల పోలీసులు తీసుకున్నారు. సిరిసిల్ల లో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ సౌండ్ వచ్చే వాటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి వాహనాలు రోడ్డు ఫై కి వచ్చి స్పీడ్ గా వెళ్తున్నారు. ఓ వైపు సౌండ్.. మరో వైపు స్పీడ్ తో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. కొంత మంది యూత్ ఇలాంటి బైక్ లు వాడుతున్నారు. పోలీసులు ఎన్ని సార్లు చెప్పున వినడం లేదు.. దీంతో.. ఇలాంటి చర్యలు తీసుకొని.. యూత్ కి బుద్ది చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: రికార్డుల రారాజుగా పుష్పరాజ్.. తగ్గేదేలే
ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??
మ్యాచ్ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!