Lifestyle: గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి కాదు, అందానికి కూడా గ్రీన్‌ టీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
Green Tea Face Pack
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2024 | 8:39 PM

ఇటీవల గ్రీన్‌ టీ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన నేపథ్యంలో చాలా మంది రెగ్యులర్‌ టీకి బదులుగా గ్రీన్‌ టీని తీసుకుంటున్నారు. గ్రీన్‌టీలోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రీన్‌ టీ తాగిన తర్వాత ఆ బ్యాగ్‌లను పడేస్తుంటాం. కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీ బ్యాగులు అందానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్‌ టీ ఫేస్‌ ప్యాకతో చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి. ముల్తానీ మట్టి, పసుపు, బియ్యప్పిండి, అరటిపండుతో గ్రీన్ టీని ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. మొటిమలను తగ్గించడంలో, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, గ్రీన్‌ టీ కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముల్తానీ మట్టిలో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చేసుకోవాలి. అలాగే డెడ్ స్కిన్, ఎక్సెస్ ఆయిల్‌ను తొలగిస్తాయి.

బియ్యంపిండిలో గ్రీన్‌ టీ కలుపుకొని ఫేస్‌కు అప్లై చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకోసం 2 టీస్పూన్ల బియ్యం పిండిలో 1 టీస్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేసుకోండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం నిగారిస్తుంది. గ్రీన్‌ టీలో పసుపు కలుపుకుని తీసుకోవడం వల్ల ముఖంపై మురికి తొలగిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ప్యాక్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి. వారానికి రెండు సార్లు పసుపు, గ్రీన్‌ టీ ఫేస్‌ ప్యాక్‌ ముఖానికి అప్లై చేసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

అరటిపండులో గ్రీన్ టీ కలిపి తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా చలికాలం చర్మం పొడిబారకుండా ఉండేందుకు అరటిపండులో గ్రీన్‌ టీ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా మారుస్తుంది. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..