AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా…? అయితే, ఈ పువ్వు మీకు వరంలా పనిచేస్తుంది..!

చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ఉండే ముడతల్ని కూడా ఇవి పోగొడతాయి. ఈ పూలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. యాంగ్జైటీ, ఒత్తిడి సమస్యలను కూడా సులువుగా పోగొడతాయి.

మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా...? అయితే, ఈ పువ్వు మీకు వరంలా పనిచేస్తుంది..!
Butterfly Pea Flower
Jyothi Gadda
|

Updated on: Dec 04, 2024 | 7:49 PM

Share

మధుమేహం.. చాపకింద నీరులా సోకే వ్యాధి. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు షుగర్‌ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. అందులో భాగంగా శంఖుపూలు షుగర్‌ బాధితులకు వరంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు కూడా మధుమేహంతో బాధపడుతున్నట్టయితే శంఖు పూలను ఉపయోగించడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శంఖుపూలలో ఔషధ గుణాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. శంఖు పూలతో టీ చేసుకుని తీసుకుంటే బోలేడన్నీ లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. శంఖుపూలతో మరిగించిన నీటిని తీసుకుంటే కూడా షుగర్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో ఈ శంఖు పూలని వేసి మరిగించి తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కంటికి రక్తప్రసరణ బాగా జరిగి కంటి సమస్యలు తగ్గుతాయి.

శంఖుపూలతో తయారు చేసిన టీ, కషాయం వంటివి తీసుకోవటం వల్ల జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చేందుకు శంఖుపూలు బాగా హెల్ప్ చేస్తాయి. చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ఉండే ముడతల్ని కూడా ఇవి పోగొడతాయి. ఈ పూలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. యాంగ్జైటీ, ఒత్తిడి సమస్యలను కూడా సులువుగా పోగొడతాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..