హరిద్వార్ వెళ్తున్నారా..? గంగాలో మునిగితే అంతే సంగతి..! పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెబుతుందంటే..
కేవలం గంగాజలంతో స్నానం చేయడం వల్ల మన శరీరంలోని రోగాలు నయమవుతాయి.. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయని అన్నారు.అలాంటిది గంగాజలం తీసుకుని 10 ఏళ్ల తర్వాత తనిఖీ చేస్తే అందులో ఎలాంటి కల్మషం కనిపించదని చెబుతుంటారు. గంగాజలాల స్వచ్ఛతకు సంబంధించి బయటకు వస్తున్నదంతా..
హరిద్వార్‌లోని గంగా జలం తాగడానికి పనికి రాదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) తెలిపింది. హరిద్వార్‌లోని గంగా నది నీటి నాణ్యత కేటగిరీ ‘బి’ స్థాయికి పడిపోయిందని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. భక్తులు స్నానానికి మాత్రమే ఆ నీటిని వినియోగించుకోవచ్చని సూచించింది. ప్రతి నెల 8 ప్రాంతాల్లో పీసీబీ నీటి పరీక్షలు నిర్వహిస్తోంది.
UKPCB ప్రాంతీయ అధికారి రాజేంద్ర సింగ్ తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రతి నెలా ఉత్తరప్రదేశ్ సరిహద్దులో హరిద్వార్ చుట్టూ ఎనిమిది ప్రదేశాలలో గంగా జలాన్ని పరీక్షిస్తుంది. ఇటీవలి పరీక్షల్లో నవంబర్ నెలకు సంబంధించిన గంగా నది నీరు ‘బి’ కేటగిరీగా తేలింది. నది నీటిని ఐదు కేటగిరీలుగా విభజిస్తారు. ఇందులో ‘ఎ’ అతి తక్కువ విషపూరితమైనది. అంటే క్రిమిసంహారక తర్వాత నీటిని తాగడానికి వనరుగా ఉపయోగించవచ్చు. ఇక ‘ఇ’ అత్యంత విషపూరితమైనది.
అధికారులు తెలిపిన వివరాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి నాణ్యతను 5 కేటగిరీలుగా విభజించింది. నాలుగు పారామితుల (pH, కరిగిన ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ మొత్తం కోలిఫాం బ్యాక్టీరియా) ఆధారంగా గంగా నది నీటి నాణ్యత ‘బి’ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించారు. అంటే గంగా జలం స్నానానికి అనుకూలంగా ఉంటుంది.
నీటి కాలుష్యంపై స్థానిక పూజారి ఉజ్వల్ పండిట్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల వల్ల గంగాజల స్వచ్ఛత దెబ్బతింటుందని అన్నారు. కేవలం గంగాజలంతో స్నానం చేయడం వల్ల మన శరీరంలోని రోగాలు నయమవుతాయి.. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయని అన్నారు.అలాంటిది గంగాజలం తీసుకుని 10 ఏళ్ల తర్వాత తనిఖీ చేస్తే అందులో ఎలాంటి కల్మషం కనిపించదని చెబుతుంటారు. గంగాజలాల స్వచ్ఛతకు సంబంధించి బయటకు వస్తున్నదంతా మానవ వ్యర్థాల వల్లేనని, దానిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..