చలికాలంలో చియా సీడ్స్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు..
Jyothi Gadda
04 December 2024
TV9 Telugu
చియా విత్తనాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన చిన్న గింజలు. దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అందుకే అవి ఇప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకుంటున్నారు.
TV9 Telugu
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉండే వాటిలో చియా సీడ్స్ ఒకటి. ఒమేకా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
TV9 Telugu
అధిక బరువును తగ్గిస్తాయి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం మూలంగా జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది. వీటిలోని విటమిన్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
TV9 Telugu
శీతాకాలంలో చియా విత్తనాలు చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని సహజంగా తేమగా మార్చే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
TV9 Telugu
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన చియా విత్తనాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాటంలో శక్తివంతంగా పనిచేస్తాయి.
TV9 Telugu
చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. క్రమబద్ధతను ప్రోత్సహిస్తాయి.
TV9 Telugu
చియా సీడ్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బులను నివారించడంలో, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
TV9 Telugu
చియా గింజలలో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఆకలి, అధికంగా తినాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో మీరు మితంగా తింటారు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.