నోరూరించే జామ పండు ఇష్టపడని వారుండరు. పులుపు, తీపి, వగరు కలగలిపిన జామ ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. పైగా అన్ని రకాల ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయి
TV9 Telugu
శరీరానికి మేలు చేసే కీలక విటమిన్లు, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్యాలను నియంత్రించడమే కాదు... మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ పెంపొందిస్తాయని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
జామ శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిది. ముఖ్యంగా జామకాయలో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు ఉన్నందున ఇది మంచి పోషకాహారం
TV9 Telugu
జామలో అనేక రకాలు ఉంటాయి. అందులో పింక్ జామ ఒకటి. చూడ్డానికే కాదు రుచికి కూడా ఇవి బలేగా ఉంటాయి. పింక్ జామలో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఈ పండు మధుమేహా వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదట. పింక్ జామలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చక్కెర, పిండి పదార్థాలు, విటమిన్ సి తక్కువగా ఉంటాయి
TV9 Telugu
ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని ఫైబర్, నీటి కంటెంట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
ఇందులోని బి-3, బి-6 రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చర్మం మృదువుగానూ ఉంటుంది
TV9 Telugu
కళ్లకు మేలు చేస్తుంది. చయాపచయ క్రియ (మెటబాలిజం)ను క్రమబద్ధం చేస్తుంది. జామకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. తరచూ తిన్నట్లయితే క్యాన్సర్ ప్రమాదం దరి చేరదు