Pushpa 2: అభిమానులకు షాక్.. ‘పుష్ప 2’ 3డి వెర్షన్‌ క్యాన్సిల్.. ఓన్లీ 2డి

ముందుగా 'పుష్ప 2' 3డి వెర్షన్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. అయితే ఇప్పుడు పుష్ప టీమ్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 'పుష్ప 2' 3డి వెర్షన్ ఈ వారం విడుదల కావడం లేదు. దాంతో ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాక్సాఫీస్ పండిట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

Pushpa 2: అభిమానులకు షాక్.. 'పుష్ప 2' 3డి వెర్షన్‌ క్యాన్సిల్.. ఓన్లీ 2డి
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2024 | 12:06 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా విడుదలకు మరికొన్ని గంటలే ఉంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్  ‘పుష్ప 2’ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2 సినిమా. విడుదల తర్వాత పుష్ప 2 సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ‘పుష్ప 2’ 2డితో పాటు 3డిలో కూడా విడుదల కావాల్సి ఉంది. ముందుగా దీని కోసం బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. కానీ, ఇప్పుడు బుకింగ్స్ ఆపేశారు.

ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్

‘పుష్ప 2’ 3డి వెర్షన్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. అయితే ఇప్పుడు టీమ్ తన స్టాండ్ మార్చుకుంది. కొన్ని కారణాల వల్ల ‘పుష్ప 2’ 3డి వెర్షన్ ఈ వారం విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని బాక్సాఫీస్ పండిట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ సమాచారం ఇచ్చారు. ఇది అభిమానులను కలిచివేసింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇప్పటికే ‘బుక్ మై షో’ నుంచి తెలుగు, హిందీ 3డి వెర్షన్ బుకింగ్ ఆప్షన్ తొలగించారు. 3డి వెర్షన్ వచ్చే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ‘పుష్ప’ 2డిలోనే విడుదలైంది. అయితే ‘పుష్ప 2’ చిత్రాన్ని సరికొత్తగా విడుదల చేయాలనే సాహసంతో టీమ్ ముందుకొచ్చింది. కానీ ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, డాలీ ధనంజయ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్, పాటలు సినిమా పై క్రియేట్ చేశాయి. ఇక పుష్ప 2 సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు

పుష్ప 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.