Telangana: జాతీయ రహదారిపై చిరుత కలకలం.. కాలికి గాయంతో గంటపాటు తల్లడిల్లిపోయిన చిరుత!

కామారెడ్డి జిల్లా దగ్గి సమీపంలోని హైవేరోడ్డుపైకి వచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కాలికి గాయమవ్వడంతో ఎటు కదల్లేక అక్కడ ఉండిపోయింది.

Telangana: జాతీయ రహదారిపై చిరుత కలకలం.. కాలికి గాయంతో గంటపాటు తల్లడిల్లిపోయిన చిరుత!
Leopard
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2024 | 8:16 AM

నేషనల్‌ హైవేపై చిరుత కనిపించింది..! కాలికి గాయంతో ఓ గంటపాటు రోడ్డు మీదే ఉండిపోయింది. కామారెడ్డి జిల్లా దగ్గి సమీపంలోని హైవేపై చిరుత కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ, కాలికి గాయం కావడంతో ఓ గంట పాటు నడవలేని స్థితిలో హైవేపైనే ఉండిపోయింది. వచ్చియే వాహనాలు హారన్ కొడుతున్నా ఏమాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది చిరుత. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ఇక సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. స్పాట్‌కి రాగానే చిరుత కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల ఎంతసేపు వెతికినప్పటికీ అధికారులకు చిరుత జాడలేదు. జనావాసాల్లోకి వెళ్లి నక్కిందా..? లేక అడవిలోకి జారుకుందా..? తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. అలర్ట్‌గా ఉండాలని.. చిరుత కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇక రోడ్డుపైకొచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాలికి గాయమవ్వడంతో కదల్లేని స్థితిలో ఉన్న చిరుత.. ఓ గంటపాటు హైవేపైనే కూర్చుంది. ఆ తర్వాత కుంటుకుంటూనే రోడ్డు దాటిన చిరుత.. ఎటు వెళ్లిందో తెలియడం లేదు. అటవీ అధికారులు మాత్రం చిరుత ఆచూకీ కోసం జల్లెడపడుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..