Kushboo: ఆ స్టార్ హీరో సినిమాలో అనవసరంగా నటించా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఖుష్బూ

ఖుష్బు సుందర్ 90వ దశకంలో తమిళ, తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ చిత్రాల్లో స్టార్స్ గా నిలిచిన రజనీ, కమల్, ప్రభు, కార్తీక్ వంటి ప్రముఖ నటుల సరసన ఆమె పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు

Kushboo: ఆ స్టార్ హీరో సినిమాలో అనవసరంగా నటించా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఖుష్బూ
Kushboo Sundar
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2024 | 9:44 AM

సీనియర్ హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు తమ నటనతో అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో ఖుష్బూ ఒకరు. నటి ఖుష్బు అసలు పేరు నకత్ ఖాన్. ఆమె మొదట్లో బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 1980లో వచ్చిన “ది బర్నింగ్ ట్రైన్”లో ఒక పాటకు డాన్స్ చేశారు. ఆ తర్వాత నసీబ్, లావారీస్, కాలియా వంటి హిందీ చిత్రాల్లో నటించారు ఖుష్పూ. మొదట నకత్ ఖాన్ అని పిలిచేవారు.ఆతర్వాత సినిమాల్లో నటించడం వల్ల తన పేరును ఖుష్బుగా మార్చుకుంది. హిందీ చిత్రం జానూలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ చిత్రసీమలో సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది ఖుష్బూ..

ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్

తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్  హిట్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు సినిమాతో పరిచయం అయ్యింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఖుష్బూ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్‌గా, స్పెషల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న ఖుష్బూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ సందర్భంలో నటి ఖుష్బు గతంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఖుష్బూ రజనీకాంత్‌తో ‘అన్నత్తే’ సినిమాలో అనవసరంగా నటించాను అని ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గతంలో ఆమె మాట్లాడుతూ.. రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నేను నటించి ఉండాల్సింది కాదు. ఈ సినిమాలో నేను నటించడానికి ఎందుకు ఒప్పుకున్నానంటే.. నాకు కథ చెప్పినప్పుడు రజనీ సర్‌కి ఈ సినిమాలో పెయిర్ లేదని దర్శకుడు చెప్పడంతో ఒప్పుకున్నాను. రజినీకి జోడీ మీనా నటించడం లేదు అని చెప్పారు. దాంతో మీనా పాత్ర కీలకంగా ఉంటుందని నేను మొదట్లోనే అనుకున్నాను. షూటింగ్ మొదలైన తర్వాత దర్శకుడు కథ మార్చాడు. మొదటి ఆఫ్‌లో మాత్రమే ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఉన్నాయి. రెండవ భాగంలో మేము అక్కడ అక్కడ ఉన్నాము. దీంతో నాకు ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదు. అని ఆ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.