అదానీ కంపెనీనా మాజాకా.. ఇండియన్ నేవీ చేతికి అత్యంత శక్తివంతమైన డ్రోన్..

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసిన దృష్టి-10 స్టార్‌లైనర్ డ్రోన్‌ను భారత నావికాదళం అందుకుంది. అదానీ సరఫరా చేసిన రెండో డ్రోన్ ఇది. సముద్రంలో కదులుతున్న నౌకలపై నిఘా ఉంచేందుకు, సముద్ర రంగం భద్రతకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.

అదానీ కంపెనీనా మాజాకా.. ఇండియన్ నేవీ చేతికి అత్యంత శక్తివంతమైన డ్రోన్..
Drishti-10 starliner
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 04, 2024 | 6:06 PM

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసిన దృష్టి-10 స్టార్‌లైనర్ డ్రోన్‌ను భారత నావికాదళం అందుకుంది. అదానీ సరఫరా చేసిన రెండో డ్రోన్ ఇది. సముద్రంలో కదులుతున్న నౌకలపై నిఘా ఉంచేందుకు, సముద్ర రంగం భద్రతకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి. జనవరి 2024లో, మొదటి విజన్-10 స్టార్‌లైనర్ డ్రోన్ నేవీకి డెలివరీ చేశారు. భారత సైన్యం కూడా ఈ డ్రోన్‌లను అందుకుంది.. అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ, ఇజ్రాయెల్ ఎల్బిట్ సిస్టమ్స్ కంపెనీతో కలిసి దృష్టి-10 (Drishti-10) స్టార్‌లైనర్ డ్రోన్‌ను తయారు చేసింది. ఇది ప్రాథమికంగా ఎల్బిట్ సిస్టమ్స్ హెర్మేస్-900 డ్రోన్ భారతీయ వెర్షన్… దృష్టి-10 స్టార్‌లైనర్ డ్రోన్ ఎల్బిట్ సిస్టమ్స్ ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటుంది..

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన డ్రోన్‌లలో హీర్మేస్-900 ఒకటి. హీర్మేస్-900 అత్యంత శక్తివంతమైన డ్రోన్‌గా గుర్తించబడింది. దీని తర్వాత MQ-9 రీపర్, గ్లోబ్ హాక్, బోయిరాక్టార్ TB2, వింగ్ లూంగ్-2 ఉన్నాయి. ఇది 30,000 అడుగుల ఎత్తుకు చేరుకోగలదు. 36 గంటలపాటు నిరంతరంగా దీనిని ఉపయోగించవచ్చు.. దాదాపు ఒక టన్ను బరువున్న ఈ డ్రోన్ దాదాపు 450 కిలోల పేలోడ్‌తో పనిచేస్తుంది.

సముద్ర ప్రాంతం.. సరిహద్దులను కాపాడేందుకు, శత్రువులపై నిఘా ఉంచేందుకు, భద్రతను పెంచేందుకు ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే డ్రోన్‌ను ఇజ్రాయెల్ కంపెనీతో కలిసి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ భారతదేశంలో తయారు చేస్తోంది. ఇది హైదరాబాద్ లోని ఫ్యాక్టరీలో తయారవుతోంది.

జూన్‌లో, భారత సైన్యం దృష్టి-10 డ్రోన్‌ను అందుకుంది.. ఇది భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా, జూన్ లో సైన్యం మరో డ్రోన్‌ను కూడా అందుకుంది.. ఇలా భారత సైన్యం మొత్తం నాలుగు డ్రోన్‌లను అందుకోనుంది.

Drishti 10 Starliner Drone

Drishti 10 Starliner Drone

సరికొత్త స్పెసిఫికేషన్లతో..

UAV సిస్టమ్ ఎయిర్‌వర్థినెస్ కోసం NATO STANAG 4671 (ప్రామాణిక ఒప్పందం 4671) సర్టిఫికేషన్‌తో ఉన్న ఏకైక ఆల్-వెదర్ మిలిటరీ ప్లాట్‌ఫారమ్ తోపాటు.. గగనతలంలో ఎక్కడికైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. MALE ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి అధునాతన పేలోడ్ సూట్‌లు.. విభిన్న సామర్థ్యాలు ఉన్కనాయి.. ఇది భారతీయ నావికాదళం సముద్ర నిఘాలో ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తుందని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి.

MALE అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్.. ఇది 10,000 నుంచి 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగల ఒక రకమైన మానవరహిత వైమానిక వాహనం (UAV). MALE UAVలు సాధారణంగా నిఘా.. భద్రత కోసం ఉపయోగిస్తారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..